నాగార్జున ఆక్రమణలో తుమ్మిడి చెరువు : 'జనంకోసం' ఫిర్యాదు

బుధవారం, 10 ఏప్రియల్ 2013 (19:52 IST)
File
FILE
సినీ నటుడు నాగార్జున మాదాపూర్ సమీపంలోని తుమ్మిడి చెరువును ఆక్రమించారంటూ "జనంకోసం" అనే స్వచ్ఛంధ సంస్థ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. నాగార్జున ఆక్రమించిన చెరువులో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఆ సంస్థ ప్రతినిధులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటికే అక్కినేని నాగార్జునపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడుకుంటున్నారనీ, దీనిపై న్యాయ పోరాటం చేయనున్నట్టు రేవంత్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.. జనంకోసం అనే స్వచ్ఛంధ సంస్థ లోకాయుక్తలో బుధవారం ఉదయం ఒక ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని మాదాపూర్‌కు సమీపంలో ఉన్న తుమ్మిడి చెరువును ఆక్రమించి, 'ఎన్ కన్వెన్షన్ సెంటర్'‌ను నిర్మించారని స్వచ్ఛంధ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. దీనిని స్వీకరించిన లోకాయుక్త.. ఫిర్యాదులో పేర్కొన్న అంశంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి