నాన్నకే నా మద్దతు.. బాబాయ్‌కు నో: రామ్ చరణ్

శనివారం, 8 మార్చి 2014 (10:03 IST)
FILE
బాబాయ్ పవన్ కల్యాణ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టినా తన మద్దతు మాత్రం తన తండ్రి చిరంజీవికేనని మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ స్పష్టం చేశారు. తాజాగా పవన్ కొత్త పార్టీ పెడతారన్న దానిగురించి రామ్ చరణ్‌ను విలేకరులు అడిగితే చెర్రీ పై విధంగా స్పందించాడు.

బాబాయ్ పవన్ కొత్త పార్టీ పెట్టినా తన మద్దతు మాత్రం నాన్న చిరంజీవికేనని స్పష్టం చేశారు రామ్ చరణ్. "బాబాయ్ దారి బాబాయ్‌దే... నా దారి నాదే'' అంటూ వ్యాఖ్యానించాడు. తన మద్దతు నాన్నకే ఉంటుందని తేటతెల్లం చేశాడు చెర్రీ. ఐతే తనకు మాత్రం రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పాడు.

మొత్తమ్మీద మెగా ఫ్యామిలీ మధ్య మార్చి 14 తర్వాత స్పష్టమైన విభజన రేఖ కనబడబోతున్నట్లు అనిపిస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా, చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వంటివాటితో పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదించారు. అలా పడిన అంతరం రోజురోజుకీ క్రమంగా పెరుగుతూ వచ్చిందని ఇటీవలి సంఘటనలు ఎన్నో చెపుతున్నాయి. పవన్ కళ్యాణ్ - చిరుల మధ్య ఉన్న గ్యాప్ ఎంతో మార్చి 14 తర్వాత కాని తెలియదు.

వెబ్దునియా పై చదవండి