మద్యం నియంత్రణపై మహిళలే పోరాడాలి: చంద్రబాబు

రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలపై మహిళలు ముందుకు వచ్చి పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పర్యటన శుక్రవారం కాకినాడలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు.

ముఖ్యమంత్రిగా రోశయ్య కొనసాగుతున్నప్పటికీ ఆయనను ఏ ఒక్క మంత్రి వినడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇందుకోసం ప్రజలే ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధానంగా రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యంపై మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు. మద్యం సిండికేట్ల రేట్లు పెంచిన ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటుందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని ఈ మద్యం సిండికేట్లు గుల్ల చేస్తున్నాయని ఆరోపించారు. ఇకపోతే.. పలువురి మృతికి కారణమవుతున్న సూక్ష్మ రుణ సంస్థలను నిషేధం విధించాలని చంద్రబాబు కోరారు.

వెబ్దునియా పై చదవండి