విమర్శలు మాని.. బాధితులను ఆదుకోండి: మొయిలీ

FILE
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై విపక్షాలు చేస్తోన్న విమర్శలు మాని.. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ పిలుపు నిచ్చారు.

రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాలను వరదలు ముంచెత్తిన ఈ సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదని మొయిలీ హితవు పలికారు.

రాష్ట్రానికి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన వెయ్యికోట్ల సాయం మొదటి విడత మాత్రమేనని మొయిలీ తెలిపారు. దీంతో వరద బాధితులకు పూర్తి సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని మొయిలీ చెప్పారు. అలాగే వరదబాధితులకు సహాయకచర్యలు, పునరావాసం ఏర్పాట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుందని మొయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి