హరికృష్ణ బహిరంగ లేఖ : తారకరాముడి బిడ్డగా విభజనకు సై....

శుక్రవారం, 2 ఆగస్టు 2013 (17:42 IST)
File
FILE
రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇవ్వడాన్ని నందమూరి తారకరాముడు బిడ్డగా తలవంచి అంగీకరిస్తున్నానంటూ నందమూరి హరికృష్ణ బహిరంగ లేఖ ద్వారా తెలిపారు. ఐతే ఈ విభజన అంశం సక్రమంగా జరగలేదనీ, ఒక కన్నుక కాటుక పూసి మరో కన్నుకు కారం పూసినట్లుగా ఉందని పేర్కొన్నారు. విభజనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజల నోట్లో దుమ్ము కొట్టి నడిరోడ్డుపై నిలబెట్టిందన్నారు.

విభజన చేసేటపుడు కేటాయింపులు, వనరుల పంపిణీ వంటివేవీ చెప్పకుండా ఒకే వాక్యంతో సీమాంధ్రను వేరు చేసేసిందనీ, సంప్రదింపులకు అవకాశమే లేకుండా చేయడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణా వాదాన్ని పురిగొల్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ విభజనపై తీసుకున్న నిర్ణయంపై హరికృష్ణ విమర్శిస్తూనే తెలంగాణ ఏర్పాటును సమర్థించారు. ఐతే నిర్ణయం తీసుకున్న విధానాన్ని తప్పుబట్టారు. సీమాంధ్ర ప్రజల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు మరో రెండుమూడు రోజుల్లో రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి