ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో జంతు ప్రేమికులు కన్నీరు పెడుతున్నారు. నిత్యం ఇక్కడకు ఎంతోమంది వచ్చి గోవులకు సేవ చేస్తుంటారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీ లత, సబ్ కలెక్టర్ మిషా సింగ్ పరిశీలించారు.
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. "గోసంరక్షణ శాలలో పరిమితికి మించి ఆవులు ఉన్నాయి. పచ్చగడ్డి మోతాదుకు మించి తినడం వల్లే చనిపోయి ఉంటాయని అనుమానం. పచ్చగడ్డిపై ఎరువుల శాతం ఎక్కువుగా ఉందనే అనుమానంపై ల్యాబ్ కు పంపాం. 48గంటల్లో పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది" అని వివరించారు.