Bhootham Preetham title and first look released by Anil Ravipudi
ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది? అనే పాయింట్ తో భూతం ప్రేతం చిత్రం రూపొందింది. యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు నటించారు. సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి. వెంకటేశ్వర రావు నిర్మించగా రాజేష్ ధృవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.