పట్టిసీమ నుంచి 15-20 టీఎంసీల నీరు : చంద్రబాబు

గురువారం, 3 సెప్టెంబరు 2015 (20:37 IST)
పట్టిసీమ నుంచి ఈ ఏడాది 15-20 టీఎంసీల నీళ్లు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జనవరి నాటికి పుంగనూరు వరకు నీళ్లు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాయలసీమ చెరువులకు నీళ్లిస్తే కరవు పరిస్థితులు ఉండవన్నారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, కృష్ణాడెల్టాకూడా ఇబ్బందుల్లో ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. 
 
ఏపీ శాసనమండలిలో చంద్రబాబు మాట్లాడుతూ... పోలవరం నుంచి కృష్ణా డెల్టావరకు చాలా కాలువలు ఉన్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని విపక్షాలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. అందరికీ న్యాయం చేసేలా విభజన జరిగి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. 

వెబ్దునియా పై చదవండి