ఈ వీడియోలు తర్వాత వైరల్ అయ్యి, పోలీసుల దృష్టికి వచ్చాయి. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు నిఘా పెట్టి, నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
ఇలాంటి నిర్లక్ష్యపు, ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు పాల్పడి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ఆటో డ్రైవర్లు లేదా ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.