దసరాకు అదనంగా 4,000 బస్సులు: ఆర్టీసీ ఎండీ

గురువారం, 7 అక్టోబరు 2021 (06:21 IST)
దసరాకు 4,000 బస్సులు అదనంగా నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ, పీటీడీ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఈ నెల 8 నుంచి 18 వరకూ ఈ స్పెషల్స్‌ నడుస్తాయి. వీటిలో దసరాకు ముందు 1,800 బస్సులు, తర్వాత 2,200 బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 
 
తిరుమలరావు విలేకరులతో మాట్లాడుతూ ... రెగ్యులర్‌ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవన్నారు. చార్జీలు ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పండుగల సమయంలో ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తోందనడం సరికాదన్నారు. ఒక వైపు ఖాళీగా వెళ్లే బస్సుకు మరో వైపు 50 శాతం అదనంగా వసూలు చేస్తే సంస్థకు వచ్చేది 75 శాతమేనని వివరించారు. 

ప్రజలకు మెరుగైన ప్రయాణ సేవలందించేందుకు ‘పల్లె వెలుగు’ రూపురేఖలు మార్చబోతున్నామని చెప్పారు. డీజిల్‌ ధరలతో పోల్చి, తక్కువకు లభిస్తే 100 ఎలక్ట్రిక్‌ బస్సులను అద్దెకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న ప్రైవేటు వాహనాలకు పోలీసు, ఆర్టీఏ సహకారంతో బ్రేకులేస్తామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు