శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ మోతేవారి లవ్ స్టోరీని నిర్మించారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మోతేవారి లవ్ స్టోరీ ఆరెపల్లి గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊర్లోని పర్షి (అనిల్ గీలా) అనే యువకుడి చుట్టూ కథ నడుస్తుంది. అతను సత్తయ్య (మురళీధర్ గౌడ్) కుమార్తె అనిత (వర్షిణి)తో ప్రేమలో పడతాడు. కానీ సత్తయ్య, అతని సోదరుడు నర్సింగ్ (సదన్న) తమ దివంగత తండ్రి రాసిన ఓ వీలునామాను బయటపడటం, దీంతో ఓ భూ వివాదం చెలరేగడం.. ఇక దీంతో హాస్యం, భావోద్వేగాలు పుట్టుకు రావడం, చివరకు ఊహించని మలుపులకు దారి తీయడం జరుగుతుంది.
శ్రీకాంత్ అరుపుల తన సినిమాటోగ్రఫీతో విజువల్స్‌కు ప్రాణం పోశారు. సుందరమైన గ్రామీణ ప్రకృతి దృశ్యాలను అందంగా చూపించారు. చరణ్ అర్జున్ తన అద్భుతమైన పాటలు, ఉత్తేజకరమైన నేపథ్య సంగీతంతో సిరీస్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లారు. ఎడిటింగ్ అనిల్ గీలా నిర్వహించగా.. శ్రీరామ్ ప్రశాంత్, అనిల్ గీలా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా పనిచేశారు.