అతడు బెంగుళూరులో పనిచేస్తున్నాడు. ఈ దంపతులు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసుకున్నాడు భర్త. తరువాత వీడియో భార్యకు చూపించి 10 లక్షల రూపాయలు కట్నంగా ఇవ్వాలని లేకుంటే దాన్ని అందరికీ పంపుతానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెల్ ఫోన్‌ను లాక్కుని అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.