ఓ ఇల్లాలు స్నానం చేస్తుండగా పోటోలు.. వీడియోలు తీసిన కామాంధుడు

మంగళవారం, 14 మే 2019 (22:09 IST)
ఓ ఇల్లాలు బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా, ఓ పోకిరీ ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక వివరాల్లోకి వెళితే శ్రీకాకుళంకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం గుంటూరుకు వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 
 
అయితే ఆ ఇంటి పరిసరాల్లో ఉండే ఓ పోకిరీ ఆ ఇల్లాలు స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే ఉద్దేశంతో ఆ ఇల్లాలు భర్తకు కూడా ఈ విషయం చెప్పలేదు. పోకిరీ వేధింపులు మరింత పెరిగిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 
 
ఆమె ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. దీనిపై ఆమె భర్త మాడ్లాడుతూ, సదరు పోకిరీకి వారి కుటుంబ సభ్యులు కూడా సహకరించారని, వెంటనే నిందితుడిని, అతడి కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. బాధితురాలి భర్తతో పాటు స్థానిక మహిళలు నిరసన తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ సాగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు