విమానం సీటులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఫిలిప్పీన్స్ మహిళ

మంగళవారం, 14 మే 2019 (12:25 IST)
దుబాయ్ నుంచి మనీలాకి వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ తాను కూర్చొన్న సీటులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అదీకూడా సాధారణ ప్రసవంతో బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ 3.2 కేజీల బరువుతో ఆరోగ్యం ఉంది. అయితే, ఈ మహిళ డెలీవరీ డేట్ కంటే మూడు వారాల ముందు డెలివరీ అయింది. ఇందుకోసం ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో డెలివరీ చేయాల్సి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిలిప్పీన్స్‌కు 35 యేళ్ళ మహిళ దుబాయ్‌లోని ఓ కంపెనీలో పని చేస్తోంది. పైగా, ఆమె నిండు గర్భిణి. డెలీవరీకి మరో మూడు వారాల సమయం ఉంది. అయినప్పటికీ ఈ నెలల 8వ తేదీన మనీల నుంచి దుబాయ్‌కు బయలుదేరింది. 
 
అయితే, ఆమెకు విమానంలో గగనంలో ఉండగా, పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని విమానం సహాయక సిబ్బంది పైలెట్లకు చేరవేశారు. ఆ వెంటనే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ అధికారులను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. అదేసమయంలో గర్భిణి ప్రసవ వేదనను చేరవేశారు. 
 
దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అర్థరాత్రి 12 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి ఒక వైద్య బృందాన్ని ఎయిర్‌పోర్టుకు రప్పించారు. ఈ వైద్య బృందం విమానం ల్యాండ్ అయ్యేలోపే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వైద్య బృందం నేరుగా విమానంలోకి వెళ్లి ఆమె కూర్చొన్న సీటులోనే డెలివరీ చేశారు. ఆ గర్భిణీని బయటకు తీసుకొచ్చే సమయం లేకపోవడంతో విమానంలోనే ప్రసవం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఆ మహిళకు వైద్యం చేసిన బృందంలో ఒకరైన జూనియర్ కన్సల్టెంట్ సి.అర్చనారెడ్డి మాట్లాడుతూ, 'సాధారణ ప్రసవం చేయడంతో ఆమె చాలా రక్తం కోల్పోయింది. పుట్టిన శిశువు 3.2 కేజీలతో ఆరోగ్యంగా ఉంది. భద్రతా కారణాల రీత్యా కొన్ని పరికరాలు విమానాశ్రయంలోకి తీసుకెళ్లలేక పోయినట్టు చెప్పారు. ప్రసవం తర్వాత తల్లిని బిడ్డను ప్రత్యేక ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి, మిగిలిన ప్రక్రియను పూర్తిచేసినట్టు ఆమె చెప్పారు.
 
కాగా, నాలుగు నెలల క్రితం కూడా ఫిలిప్పీన్స్‌కు చెందిన 40 యేళ్ళ మహిళ కూడా ఇదే విధంగా గగనంలో డెలీవరీ అయింది. ఈ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేసినప్పటికీ పుట్టిన శిశువును బతికించలేక పోయారు. ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి మనీలాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. అలాగే, 2016లో కూడా ఫిలిప్పీన్‌కు చెందిన మహిళ ఒకరు యూఏఈ నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళుతూ ఇదే విధంగా విమానంలో డెలివరీ అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు