రవాణా శాఖలో ఆధార్ తప్పనిసరి.. నేటి నుంచి అమలు..!

సోమవారం, 27 జులై 2015 (06:46 IST)
ఈ మధ్యకాలంలో ఆధార్‌కార్డు ప్రాధాన్యత పెరిగిపోతోంది. రవాణా శాఖలో కార్యకలాపాలకు ఆధార్‌‌కార్డు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు.  హైదరాబాద్ సిటీలో డ్రైవింగ్ లైసెన్సు కావాలన్నా... వాహనం కొనాలన్నా... చివరుకు ఎఫ్‌సీ చేయించాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరి చేసేశారు. అది సోమవారం నుంచి అమలులోకి వస్తుంది. 
 
డ్రైవింగ్‌ లైసెన్సుతో పాటు కొత్త వాహనాల రిజిస్ర్టేషన్‌, పాత వాహనాల మార్పిడి, ఫిట్‌నెస్‌ ఇలా ఆర్టీఏ కార్యాలయాల్లో రకరకాల సేవలు పొందే వాహనదారులు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచింది. జూలై 27 నుంచి ఇది అమల్లోకి వస్తుందని హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా శాఖ కమిషనర్‌ టి.రఘునాథ్‌ తెలిపారు. వాహనదారుల చిరునామాలు, వాహనాల రిజిస్ర్టేషన్‌లలో ఇచ్చే చిరునామాలు చాలా కీలకం. గ్రేటర్‌ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్‌ కార్డులు తీసుకురావాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి