ఆ యువతిని పరామర్శించి వెళుతుండగా, లిఫ్టు వైరు తెగిపోయింది. ఆసమయంలో లిఫ్ట్‌లో ఉన్న డిప్యూటీ సీఎం చినరాజప్పసహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చినరాజప్ప నడుముకు గాయమైంది. వెంటనే స్పందించిన హాస్పటల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించారు. పెద్దప్రమాదం తప్పడంతో మంత్రి అనుచరులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.