బాధేస్తుంది... అలా అడగొద్దంటున్న జీవిత

గురువారం, 4 జులై 2019 (14:43 IST)
సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ తాజాగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'క‌ల్కి' సినిమా గత శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రాజ‌శేఖ‌ర్‌, జీవిత మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల స‌మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేక‌ర్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పుకొచ్చారు. 
 
అయితే... ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి.. 'మీరు క‌ల్కి సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్లో వేలు పెట్టార‌ట క‌దా?' అని జీవిత‌ను ప్ర‌శ్నించడం ఆవిడకి చిరాకు తెప్పించింది... ఆ ప్ర‌శ్న‌కు సీరియ‌స్ అయిన జీవిత ఘాటుగానే స‌మాధానం ఇచ్చారు. 'ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 20 కోట్ల రూపాయ‌లు పైగానే ఖ‌ర్చ‌యింది. అలాంట‌ప్పుడు డ‌బ్బులు పెట్టిన నిర్మాత‌లకు కూడా సినిమా తెర‌కెక్కించిన విధానం న‌చ్చాలి క‌దా! సినిమా నాదైన‌ప్పుడు, నేను డ‌బ్బులు పెడుతున్న‌ప్పుడు సినిమా గురించి ప‌ట్టించుకోకుండా ఎలా ఉంటాను. 
 
నేను 30 ఏళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాను. కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. నాకూ కొంత ప‌రిజ్ఞానం ఉంది. సినిమా బాగా రావాల‌నే అంద‌రూ ప‌నిచేస్తారు. ఎందుకు మీరు ఇలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారు. 'ద‌ర్శ‌క‌త్వప‌రంగా మీరెలాంటి స‌ల‌హాలు ఇచ్చారు?' అని అడ‌గాలి. అంతేకానీ 'ఎందుకు జోక్యం చేసుకున్నారు?' అని అడ‌గ‌కూడ‌దు. ఇలాంటి విష‌యాలు బాధ క‌లిగిస్తాయ' అని జీవిత చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు