ఆ కథనం చూశాక, ప్రజలు బుర్రలు పగులగొట్టుకుంటున్నారు: దివ్యవాణి
మంగళవారం, 6 అక్టోబరు 2020 (07:54 IST)
రాష్ట్రంలో ఎటుచూసినా ప్రభుత్వం సృష్టించిన సమస్యలు, పోరాటాలు, అవమానాలే కనిపిస్తున్నాయని, పాలకుల కారణంగా ప్రజలంతా చెప్పుకోలేని ఆవేదనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే ...!
ముఖ్యమంత్రి పత్రిక అయిన అసాక్షిలో గాంధీ మళ్లీ పుట్టాడనే కథనంలో, జగన్ ను మహాత్ముడితోపోలూస్తూ రాయడం జరిగింది. దేశానికి సేవలందించిన మహానుభావులు, రాష్ట్ర్రాన్ని అభివృద్ధిచేసినవారెవరూ ఏనాడూ ఇలాంటి పోలికలు తేలేదు. అసాక్షి రాతలుచూసి, ప్రజలంతా తమబుర్రలు పగులగొట్టు కుంటున్నారు. జగన్ ను కలియుగగాంధీతో పోల్చడాన్ని “ఇయర్ ఆఫ్ ది జోక్”గా చెప్పుకుంటున్నారు.
ఆ గాంధీ మహాత్ముడు అహింసావాదిగా పేరు తెచ్చుకుంటే, ఈ రాష్ట్ర గాంధీ మాజీముఖ్యమంత్రిని ఉద్దేశించి, నడిరోడ్డులో కాల్చిచంపండి అన్న వ్యాఖ్యలను రాష్ట్రవాసులు మర్చిపోలేదు. ఆ గాంధీ గారు అబద్ధాలు చెప్పకూడదంటే, ఈ కలియుగగాంధీ అమరావతి విషయంలో ఆడిన మాటతప్పాడు. ఆయనకు వత్తాసుగా మాట్లాడి, జబర్దస్త్ షోలుచేసిన గబ్బునోళ్లన్నీ ఒక్కఛాన్స్ ఇస్తే, జగనన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముంచి తేలుస్తాడన్నాయి.
జగన్ కు ఓటేసిందుకు రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కున్నామని వాపోతున్నారు. కలియుగ గాంధీ అమరావతి వాసులమధ్య నుంచి అసెంబ్లీకి పోయేటప్పడు తెరలు అడ్డుగా పెట్టుకొని ఎందుకు పోతున్నాడు? దాదాపు 300రోజులుగా అమరావతికోసం రైతులు చేస్తున్న ఆందోళనలు ఏమయ్యాయి? మంత్రులుగా ఉన్నవారు అమరావతి రైతులను ఉద్దేశించి, వారంతా పతితలకు పుట్టిన కొడుకులని అనడం చూస్తున్నాం.
ఏ రంగాల్లో చూసినా రైతులకు పుట్టినవారే ఉన్నారనే నిజాన్నిపేరులో ధర్మాని చేర్చుకున్న అధర్మ మంత్రి తెలుసుకోవాలి. మంత్రుల నీచపువ్యాఖ్యలను కలియుగగాంధీ చెవులుండీ వినలేకపోతున్నారా? మహాత్ముడితో పోల్చుకుంటూ, అసాక్షిలో తనగురించి రాయించుకునే ముందు, కలియుగ గాంధీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది.
ప్రజల కోసం కష్టపడుతూ, వారిగురించి ఆలోచించే వ్యక్తి కాబట్టే, చంద్రబాబునాయుడు అన్నీ భరిస్తున్నాడు. ముఖ్యమంత్రే, మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నాడని ప్రజలంతా అనుకుంటున్నారు. చరిత్రనే తిరగరాయగల శక్తి మీడియావారికి ఉందని, సదరు మీడియావారిలో కూడా రైతుబిడ్డలున్నారని, వారంతా మంత్రి వ్యాఖ్యలపై రోషం, పౌరుషాలతో పనిచేయాలి. తన వ్యాఖ్యలపై మంత్రి ఇప్పటికైనా పశ్చాత్తాపం ప్రకటించి రైతులకు క్షమాపణ చెప్పాలి.
కలియుగ గాంధీ వైఖరిచూస్తున్న ప్రజలంతా, ఆయన కొత్తగా బూతులకు సంబంధించి శాఖను పెడుతున్నారేమో అని, దానికోసమే మంత్రులు ఇలా మాట్లాడుతున్నారేమో అనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈనాడు అమరావతికోసం పోరాడుతున్న రైతులు, మహిళలకు న్యాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. కరోనా సమయంలో కూడా అమరావతి మహిళలు ఢిల్లీ వెళ్లి మరీ న్యాయంకోసం చెట్లకింద కూర్చుని ఆర్తనాదాలు చేస్తున్నారు.
వారి ఆర్తనాదాలు కలియుగగాంధీ చెవిన పడకపోవడం బాధాకరం. కలియుగ గాంధీ మామగారి అంత్యక్రియల్లో, తోటకూర ...గోంగూర..కరివేపాకు అంటూ ఒకామె ఉపన్యాసం దంచింది. సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఆమె ప్రతిసారీ నా అల్లుడు చంద్రబాబు అంటూ ఉంటుంది. ఆమె భువనేశ్వరినికన్నదా..లేక చంద్రబాబు కాళ్లు కడిగిందా? లేక మనవడని చెబుతున్న లోకేశ్ బాబు బాత్రూమ్ ఏమైనా కడిగిందా...?
కలియుగ గాంధీ గురించి ఆమెలాంటి వారు ఏదిపడితే అదిమాట్లాడితే వినేవారెవరూ లేరు. రైతులమెడకు ఉరితాళ్లు తగిలించేలా రాష్ట్రగాంధీ మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యాడు. రైతులను అవమానకరంగా దూషించినందుకు, సదరు అధర్మ మంత్రి తక్షణమే వారికి బహిరంగక్షమాపణ చెప్పాలి.
వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా, జగన్ మామ కూడా సీబీఐ విచారణకురావాల్సిన సమయంలోనే ఆయన చనిపోయారు. అదేసమయంలోనే విశాఖలో మాజీఎంపీ ఇంటిగోడను కూల్చారు. ప్రశ్నించేవారి ఇళ్లుకూల్చడం, కారుఅద్దాలు ధ్వంసంచేయడం వంటివన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగే ఘటనలన్నింటికీ కలియుగ గాంధీనే బాధ్యుడవు తాడు. మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపించారు.
రౌడీ మంత్రులు బూతులు మాట్లాడుతుంటే, నిరోధించకుండా ఏపీగాంధీ ఆనందిస్తున్నాడు. అప్పుచేసి ప్రజలకు పప్పుకూడు పెట్టాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. దాంతో బ్యాంకులన్నీ ఏపీకి నిధులివ్వలేమని చేతులెత్తేశాయి. సీబీఐ నుంచి పిలుపొచ్చి, తమనాయకుడు పూర్వపుస్థానానికి వెళ్లిపోతే, తమ పరిస్థితి ఏమిటా అని అధికారపార్టీ వారంతా వాపోతున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాల గురించి ప్రజలు మరో రకంగా అనుకుంటున్నారని కలియుగ గాంధీ తెలుసుకోవాలి. ఏపీలో నవరత్నాలను అభినవగాంధీ సరికొత్తగా అమలుచేస్తున్నా డు. ఒకటవ రత్నం దళితులపై దాడులైతే, రెండో రత్నం రైతులపై దాడులైతే, మూడోరత్నం మహిళలపై దాడులు, అత్యాచారాలని, 4వ రత్నంగా ప్రతిపక్షాలపై దాడులు, వేధింపులుగా కలియుగ గాంధీ అమలుచేస్తున్నాడు.
ఏం ఘనత సాధించారని వాలంటీర్ వ్యవస్థను అభినందిస్తూ ప్రజలు చప్పట్లు కొట్టాలో రాష్ట్రగాంధీచెప్పాలి. వాలంటీర్ ఉద్యోగాలంటూ, వారి భవిష్యత్ ను నాశనం చేస్తూ, రాష్ట్రప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.
వైసీపీ సోషల్ మీడియా విభాగం తన బతుకుదెరువుకోసం, నందిని పందిని చేస్తూ, పందిని నందిని చేస్తూ ఆనందపడుతోంది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని బతకడం తప్పుకాదుకానీ, దమ్ము, ధైర్యం వైసీపీ సోషల్ మీడియాకు ఉంటే, మండలిలో జిప్పులు తీసిన ఘటన, అసెంబ్లీలో గతంలో మహిళలను ఉద్దేశించి వైసీపీ మహిళలు చేసిన వ్యాఖ్యలను, పోలీస్ వ్యవస్థను శునకం కన్నా తక్కువచేసి మాట్లాడే అధికారపార్టీ వారి మాటలను కూడా అధికారపార్టీ సోషల్ మీడియాలో ప్రస్తావించాలి.
బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై జరిగిన దాడిని గురించి కూడా సోషల్ మీడియాలో నిలదీయాలి. కరకట్టను కూల్చడం, గేదెలకు పార్టీ రంగులేయడం తప్ప, వైసీపీ ప్రభుత్వం సాధించిందేముంది? కలియుగగాంధీ పరిపాలనను ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీఇన్ ఛార్జ్ అయిన యార్లగడ్డే పోలీసులు బాగా ఎక్కవు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలోని మహిళామంత్రులు ఇప్పటికైనా మహిళలను కించపరుస్తూ, తోటిమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించాలి. అప్పులు చేసి ప్రజలకు పప్పుకూడు పెట్టాలనే నిర్ణయాన్ని కలియుగ గాంధీ మానుకోవాలి. 300రోజులుగా అమరావతికోసం ధర్నాలుచేస్తున్న రైతులు, మహిళల గురించి ఆయన ఆలోచన చేయాలి. అసాక్షి పత్రిక కలియుగగాంధీ పేరుతో రాసిన కథనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కలియుగ గాంధీ బెదిరింపులు, అదిలింపులకు టీడీపీ నేతలెవరూ భయపడరు.
రాష్ట్రానికి చెందిన ప్రతిఒక్కరూ అమరావతిరైతులకు, మహిళలకు అండగా నిలిచి, రాష్ట్ర భవిష్యత్ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం.