హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలకృష్ణ ఓ సందర్భంలో పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని చెప్పడం... ఈ వ్యాఖ్యలకు సమాధానంగా మెగా సోదరుడు నాగబాబు తనకు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం ఎంత వివాదానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
ఇందుకు బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైనప్పటికీ.. నాగబాబు కౌంటర్‌గా పాత నటుడు బాలయ్య ఫోటోను పోస్టు చేసి.. బాలయ్య ఎవరో తెలియకుండా వుంటుందా అంటూ సెటైర్ వేసిన సంగతి కూడా మరిచిపోలేము. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు మరోసారి బాలయ్యపై సోషల్ మీడియా వ్యంగ్య కవితను పోస్టు చేశారు. తాజాగా బాలయ్య నటిస్తున్న.. ఎన్టీఆర్ బయోపిక్‌ను నాగబాబు టార్గెట్ చేశారు.