Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

దేవీ

శుక్రవారం, 22 ఆగస్టు 2025 (18:30 IST)
Chiranjeevi, Director Bobby, Venkat K. Narayana, Lohit K.N.
సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి హిట్ కాంబో రిపీట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తోన్న రెండో మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. బ్లడీ బెంచ్ మార్క్ అంటూ కొడ్డలి, పక్కన రక్తపు మరక కనిపిస్తున్న పోస్టర్ విడుదలయింది. కె.వి.ఎన్. ప్రొడక్షన్ పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ కె.ఎన్. నిర్మిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే కలిసిన ఫొటోను బాబీ విడుదల చేశారు.
 
ఇది కదా అసలైన మాస్ పంచ్ - అంటూ బాబీ తన సినిమా గురించి పంచ్ డైలాగ్ తో అభిమానులను అలరించారు. ఇప్ప‌టికే శ్రీకాంత్ ఓదెల సినిమా అనౌన్స్ అవ‌డంతో ఇప్పుడు బాబీ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఒక‌టి వినిపిస్తుంది. ఆల్రెడీ చిరంజీవితో వాల్తేరు వీర‌య్య చేసిన అనుభవం వుంది. బాబీ ఈసారి మెగాస్టార్ తో తీసే సినిమాను బాబీ ఎంట‌ర్టైన‌ర్ లాగా కాకుండా కొత్తగా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.  ఓ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కించనున్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీర‌య్య‌, డాకు మ‌హారాజ్ చిత్రాలు తీసిన బాబీ  ఈసారి చిరంజీవితో క‌లిసి ఎలాంటి సినిమా తీయనున్నాడనేది అక్టోబర్ లో రిలీవ్ చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు