కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి ఇంకా సంతాప సందేశాలు అందుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా, దశాబ్దాలు పనిచేసిన రోశయ్యకు కేంద్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి కి సంతాపం తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భం సోనియా గాంధీ ఒక లేఖను రోశయ్య కుటుంబసభ్యులకు పంపించారు. ఈ లేఖను ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ సెక్రటరీ తోపాజి అనంత కిషన్ గుప్తాలతో కలసి రోశయ్య సతీమణి శివ లక్ష్మీ కి అందించారు.