నెహ్రూకు సోనియా నివాళులు - నేడు బాలల దినోత్సవం

ఆదివారం, 14 నవంబరు 2021 (10:44 IST)
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాళులు అర్పించారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.
 
భారత మొట్టమొదటి ప్రధానిగా సేవలందించిన పండిత్​ జవహర్​లాల్​ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ మహానేతకు నివాళులర్పించారు. ఢిల్లీలోని శాంతివన్​లో నెహ్రూ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.
 
కాగా, 1889 నవంబరు 14న ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో నెహ్రూ జన్మించారు. భారత స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. 1947 ఆగస్టు 15న భారతదేశ తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న ఆయన కన్నుమూశారు. 
 
చిన్నారులను ఎంతో ఇష్టపడే నెహ్రూ పుట్టినరోజును 'జాతీయ బాలల దినోత్సవం'గా జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చిన్నారులతో వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు