ఏపీలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేలా చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా కన్పిస్తే వెంటనే జప్తు చేస్తామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్లు, ఐపాడ్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని స్పష్టం చేసింది.