ఈ సందర్భంగా గౌరవ సూచకంగా సైనికులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. జశ్వంత్‌రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కలెక్టర్, ఎస్పీ నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
కాగా, కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టారులో గురువారం(జున్ 8) అర్ధరాత్రి సెన్యానికి, ఉగ్రవాదులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంకు చెందిన తెలుగు జవాను జశ్వంత్ రెడ్డి అమరుడయ్యాడు.