ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దుచేసింది. అయితే టెన్త్, ఇంటర్ విద్యార్థుల మార్కులకు 30 శాతం వెయిటేజీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఈ మార్కుల ఆధారంగా ఆ విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్, మొత్తం గ్రేడ్ ఇవ్వనున్నారు. అయితే ఇంటర్నల్ మార్కుల విధానం అమలులోకి రావడానికి సర్కార్ జీఓ జారీ చేయాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.