నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో రైతులకు ఇచ్చే స్థలాల్లో నిర్మించే భవనాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, సీఆర్డీఏకి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.