గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, తనపై దాడుల్ని దీటుగా ఎదుర్కొంటున్న రఘురామ ఏకంగా సీఎం జగన్ తోనే సై అంటే సై అంటున్నారు. దీంతో ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ఆయనకే ఎక్కువగా మైలేజ్ పెరుగుతోంది.
ఇందుకోసం అమరావతి జేఏసీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సాయం కోరింది. ఈ మేరకు అమరావతి రైతులు, జేఏసీ నేతలు రఘురామకు లేఖలు రాశారు. అమరావతి వ్యవహారాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు, పార్లమెంటులో ప్రస్తావించేందుకు సహకరించాలని రఘురామను వారు కోరారు.
అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఇప్పటికే కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్న జేఏసీ నేతలు, రైతుల విజ్ఞప్తికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అంగీకరించారు. పార్లమెంటులో అమరావతి అంశం ప్రస్తావించారంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన రఘురామ... అమరావతి ప్రజలకు మద్దతిస్తానని ప్రకటించారు. దీంతో ఇక పార్లమెంటు వేదికగా అమరావతి పోరును తీసుకెళ్లేందుకు రఘురామ రూపంలో రైతులకు ఓ అండ దొరికినట్లయింది.