Telusukada - Srinidhi Shetty
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.