స్పందనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ రివ్యూ

మంగళవారం, 23 జులై 2019 (15:05 IST)
ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన స్పందన కార్యక్రమం పనితీరు, స్పందనకు వస్తున్న స్పందన తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా స్పందన కార్యక్రమంలో సమస్యల పరిష్కారంలో పురోగతి ఉందన్నారు. 
 
కలెక్టర్లకు, ఎస్పీలకు, అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. వినతులు ఇస్తే పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని కలిగించారని చెప్పారు. జులై 12 వరకూ పెండింగులో 59 శాతం సమస్యలు ఉంటే, జులై 19 నాటికి 24 శాతానికి తగ్గాయన్నారు. 
 
ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మున్సిపల్‌ ఆఫీసుల్లో అవినీతి కనిపించకూడదన్నారు. స్పందనపై సీఎం సమీక్ష పనిచేయని మురుగునీటి శుద్ధిప్లాంట్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను గుర్తించాలని సీఎం ఆదేశం, కట్టినా పనిచేయకపోతే ప్రజాధనం వృథా అయినట్టేనని, వాటి నిర్వహణపై దృష్టిపెట్టాలని కలెక్టర్లును ఆదేశించారు. ఇసుక సరఫరాపై దృష్టిపెట్టాలన్న సీఎం కరెంటు సరఫరాలో అంతరాయాలు రాకుండా చూడాలన్న కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు