సాధాణంగా వాట్స్ యాప్‌లో వీడియో అయినా, టెక్ట్స్ మెసేజ్ అయినా, ఫార్వార్డ్ చేసే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. కానీ, షార్ట్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి వదలగానే అది వెళ్లిపోతుంది. దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు. ఇలా చేయడం వల్ల తప్పుదొర్లే అవకాశం ఉంది.
దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన వాట్సాస్ యాజమాన్యం... రికార్డింగ్‌ను పరిశీలించి, సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఆడియో రికార్డును మరోసారి చెక్ చేసుకున్న తర్వాతే, అవతలి వ్యక్తికి చేరేలా అప్‌డేట్‌ను సిద్ధం చేశామని, ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్‌లో బీటా దశలో ఉందని, అతి త్వరలో అందరు యూజర్లకూ అందుబాటులోకి వస్తుందని సంస్థ వెల్లడించింది.