అయితే ఇటీవల డాక్టర్ అంబేద్కర్ జయంతిని వర్ధంతి అని పలికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైన నారాలోకేష్ మహానాడులో మాట్లాడుతుంటే చంద్రబాబు టెన్షన్ పడిపోయారని వార్తలొచ్చాయి. నారో లోకేష్ ఏం మాట్లాడుతారోనని చంద్రబాబు ఆందోళనకు గురైనట్లు సోషల్ మీడియాలోనూ సెటైర్లు వెల్లువెత్తాయి. దీన్నే అదనుగా తీసుకున్న వైకాపా నారా లోకేష్‌ను ఏకిపారేసింది.
మహానాడులో లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు మొహంలో టెన్షన్ కనిపించిందని అంబటి అన్నారు. సరిగ్గా మాట్లాడటమే చేతగాని లోకేష్ తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరడమా? అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. ఆనాడు ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.