నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

ఐవీఆర్

గురువారం, 31 జులై 2025 (15:43 IST)
అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం బాలల సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నార్త్ కరోలినాలోని మోరిస్‌విల్లే వేదికగా నాట్స్ బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఈ సంబరాల్లో భాగంగా తెలుగు విద్యార్ధులకు గణితం, చిత్రకళ, వక్తృత్వం, నాట్యం( శాస్త్రీయం, జానపద, మూవీ), గాత్రం, వాద్య సంగీతం ఇలా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించింది. నాట్స్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ మధు కొర్రపాటి, వేక్ కౌంటీ షెరీఫ్ విల్లే రోవి, స్థానిక పోలీస్ కెప్టెన్ రాబర్ట్ కారె, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ గరిమెళ్ల, ప్రముఖ వైద్య నిపుణులు శంకర్ అడుసుమిల్ల, డాక్టర్ పవన్ యర్రంశెట్టి తదితరులు ఈ బాలల సంబరాల్లో అత్యుత్తమంగా రాణించిన బాలలకు బహుమతులు, ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు.
 
నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట రావు దగ్గుబాటి, నాట్స్ నార్త్ కరోలినా చాప్టర్ కో ఆర్డినేటర్ ఉమా శంకర్ నార్నె, నాట్స్ నార్త్ కరోలినా చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్  దీపికా సయ్యపురాజు, వెబ్, మీడియా సమన్వయకర్త రాజేశ్ మన్నేపల్లి, ట్రెజరర్ వేణు వెల్లంకి, ఈవెంట్స్ చైర్ కల్పన అధికారి, ఈవెంట్స్ కో చైర్ భాను నిజాంపట్నం, స్పోర్ట్స్ చైర్ రవితేజ కాజా, మహిళా సాధికారత సమన్వయకర్త యశస్వినీ పాలేరులు ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బాలల సంబరాల్లో తమ విలువైన సేవలు అందించిన వాలంటీర్లు, పాల్గొన్న తల్లిదండ్రులు అందరికి నాట్స్ నార్త్ కరోలినా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. బాలల సంబరాల నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క నాట్స్ సభ్యుడికి చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు