కరోనా బాధితుడు చనిపోతే.. నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ..? (video)

మంగళవారం, 11 మే 2021 (18:56 IST)
కృష్ణాజిల్లా, తిరువూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహన్ని 108 వాహనంలో గ్రామానికి తీసుకెళ్లారు.
 
అయితే అయితే అంబులెన్స్ డ్రైవర్ గ్రామాంలోకి తీసుకెళ్లకుండా గ్రామా శివారులోని ఆ మృత దేహన్ని వదిలేసి వెళ్లాడు. దీంతో రెండు గంటలపాటు ఆ మృతదేహం ఆనాధల పడిఉది. విషయం తెలుసుకున్న తిరువురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. 
 
ఇక ఈ ఘటనపై ఏపీ మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఈ వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేస్తూ ఇది ఎంత అమానుషం, ఎంత అనాగరికం? అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కరోనా బాధితులను నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ వెళ్లిపోతున్నాయి 108 వాహనాలు. తిరువూరులో కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తూ, మధ్యలో చనిపోతే మానవత్వం లేకుండా నడిరోడ్డు మీదే వదిలేయడం అమానుషం, అనాగరికం. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? pic.twitter.com/ANu4jh3BDS

— N Chandrababu Naidu (@ncbn) May 11, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు