భారత జాతీయ గీతం ఆలపించిన అమెరికా సైనికులు (Video)

గురువారం, 19 సెప్టెంబరు 2019 (09:47 IST)
మన జాతీయ గీతాన్ని ఆలపించేందుకు చాలా మంది నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. మరికొందరైతే అసలు జాతీయ గీతాన్ని వినేందుకు కూడా సమ్మతించరు. కానీ, అమెరికా సైనికులు జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అరుదైన దృశ్యం ఇండో - యూఎస్ సైనిక విన్యాసాల్లో చోటుచేసుకుంది. 
 
ఈ నేప‌థ్యంలో అమెరికాలోని మెకార్డ్ జాయింట్ బేస్ లూయిస్ వ‌ద్ద యుద్ధ అభ్యాస్ విన్యాసాలు నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి 16 వ‌ర‌కు అభ్యాస్ విన్యాసాలు చేప‌ట్టారు. అయితే విన్యాసాలు ముగింపు రోజున‌.. అక్క‌డ భార‌త జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌ణ పాట‌ను అమెరికా సైనికులు వినిపించారు. 
 
అమెరిక‌న్ ఆర్మీ బ్యాండ్.. భార‌త జాతీయ గీతాన్ని ప్లే చేసింది. అమెరికా సైనికులు జ‌న‌గ‌ణ‌మ‌ణ పాట‌ను త‌మ బ్యాండ్‌లో వినిపించ‌డం ప‌ట్ల భార‌తీయ సైనికులు సంతోషానికి లోన‌య్యారు. అస్సాం రెజిమెంట్‌కు సంబంధించిన ఓ పాట‌పై రెండు దేశాల సైనికులు చిందులు కూడా వేశారు. 

 

#WATCH USA: American Army band playing Indian National Anthem during the Exercise Yudh Abhyas 2019 at Joint Base Lewis, McChord. pic.twitter.com/J9weLpKD3X

— ANI (@ANI) September 19, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు