వర్షంలోనే అమరావతి రైతుల మహా పాదయాత్ర

గురువారం, 11 నవంబరు 2021 (11:21 IST)
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి ప్రారంభమై జన జాతరలా సాగుతోంది. రైతుల పాదయాత్ర గొడుగులు రెయిన్‍కోట్లు ధరించి ముందుకుసాగుతున్నారు. 

రైతులు నాగులుప్పలపాడు వెళ్లే మార్గంలో రోడ్లు దిగ్బంధం రోడ్లు దిగ్బంధించి చెక్‍పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ఆంక్షలు విధించారు. ఊరూరా ప్రజలు కదలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.

పూలజల్లులు, మేళతాళాలు, కళాప్రదర్శనలతో వేలాది మంది పాదయాత్రకు మద్దతుగా నడుస్తున్నారు.

ఈ నెల 1న అమరావతిలో జేఏసీ ప్రారంభించిన మహాపాదయాత్ర పదోరోజైన బుధవారం మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 కి.మీ సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు