అమ్మాయిలను ఎక్కడెక్కడో తాకుతాడు పాల్... యాంకర్ సంచలన వ్యాఖ్యలు

సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:33 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జర్నలిస్టు శ్వేతారెడ్డి. పార్టీ పేరుతో పాల్ చేసే అరాచకాలు అన్నీఇన్నీ  కావన్నారు. తనకు హిందూపురం సీటు ఇస్తానని చెప్పి చివరకు తననే డబ్బులు అడిగారన్నారు. అంతేకాదు పాల్ కామాంధుడని, తన వద్దకు ఎవరైనా అమ్మాయిలు, మహిళలు వెళితే వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తారని ఆరోపించారు.
 
అనంతపురం జిల్లాలో పర్యటించేటప్పుడు తనతో ఇలాగే ప్రవర్తించారని, మొదట్లో నేను వార్నింగ్ ఇస్తే వెనక్కి తగ్గాడని, కానీ ఆ తరువాత ఆయన దగ్గరకు వచ్చిన మహిళలను తాకరాని చోట తాకుతూ ఉండేవాడన్నారు. అయితే శ్వేత వ్యాఖ్యలను కె.ఎ.పాల్ ఖండించారు.
 
శ్వేత ఎవరెవరితోనో సంబంధాలు పెట్టుకుందని, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని అందుకే ఆమెకు హిందూపురం సీటు ఇవ్వనని చెప్పడంతో ఆమె తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ చర్చనీయాంశంగా మారుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు