Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

చిత్రాసేన్

శుక్రవారం, 17 అక్టోబరు 2025 (14:00 IST)
Telusu kadaa poster
నటీనటులు : సిద్ధూ జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు, అన్నపూర్ణమ్మ....
సాంకేతికత:  సినిమాటోగ్రాఫర్ : జ్ఞానశేఖర్ వి ఎస్, సంగీత దర్శకుడు :  థమన్ ఎస్, నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్, దర్శకత్వం: నీరజ కోన.
 
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతూ చేసిన చిత్రం తెలుసు కదా. ట్రైలర్ చూస్తే అవాక్కయ్యేలా వుంటుంది. ఇద్దరు హీరోయిన్లతో బెడ్ షేర్, హర్ష కాంబినేషన్ లో ద్వందార్థడైలాగ్ తో కూడిన సన్నివేశాలు వుండడంతో ఇది ఇద్దరు భార్యల ముగ్గురు మొగుడు తరహానో, ఇద్దరితో సహజీవనం చేసే  హీరో ఇట్టే తెలిసిపోతుంది.

దీనిపై ఆ తర్వాత పలు విధాలుగా సోషల్ మీడియాలో టాపిక్ స్క్రోలింగ్ అవడంతో.. ఇకపై ఇలాంటి కేరెక్టర్ చేయనని సిద్దు స్టేట్ మెంట్ ఇచ్చాడు. మరి దర్శకురాలిగా మొదట ఇటువంటి ప్రయోగం చేయడం కూడా సాహసమే. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
చిన్నప్పడే తల్లిదండ్రులను కోల్పోయిన వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) కు పెండ్లీడు వచ్చాక తనకంటూ ఓ కుటుంబం కావాలని నిశ్చయంతో వుంటాడు. సింపుల్ గా కథ ఇదే. ఇక కథనంలోకి వెళితే.. వరుణ్ పెద్దయ్యాక ఓ లావిష్ రెస్టాంట్ కు ఓనర్. అప్పటికే తను ప్రేమిస్తున్న ఓ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో విసిగిపోయి పైన దేవుడ్ని తిడుతూ బలంగా ఓ కోరిక కోరుకుంటాడు. నువ్వే గనుక వుంటే.. ఆ అమ్మాయి నా చట్టూ తిరిగేలా చేయమంటాడు.
 
ఆ తర్వాత  హీరో.. పలు సంబంధాలు చూసినా నచ్చదు. ఓసారి మ్యాట్రిమోనియల్ నడిపే అంజలి శర్మ (రాశిఖన్నా)ను తను కలవడం, ఆమె అభిరుచులు, అలవాట్లు మాటల మధ్యలో రావడంతో ఆ తర్వాత పెండ్లిచేసుకోవడం కూడా జరిగిపోతుంది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో దేవుడు ఓ ట్విస్ట్ ఇస్తాడు. అంజలికి పిల్లలు పుట్టరని డాక్టర్లు తేల్చి చెబుతారు. అనంతరం సరోగసి ద్వారా డాక్టర్ రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) చెప్పిన మోటివేటివ్ స్పీచ్ కు అంజలి ఎట్రాక్ట్ అయి ఆ దిశగా బిడ్డకు తల్లి అవ్వాలనుకుంటుంది. అయితే తనే సరోసగి ద్వారా నిన్ను తల్లిని చేస్తానని డాక్టర్ రాగ ముందుకు వస్తుంది. ఆ తర్వాత ముగ్గురి జీవితాల్లో ఎటువంటి సంఘటనలు జరిగాయి? అనంతరం పరిణామాలే.. మిగిలిన సినిమా.
 
సమీక్ష:
కథపరంగా చూస్తే వరుణ్ పాత్ర మీద కథ సాగుతుంది. ఇద్దరు హీరోయిన్లు, స్నేహితుడు వైవా హర్ష.. వీరే సినిమా అంతా కనిపిస్తారు. మధ్య మధ్యలో హీరోయిన్ తల్లిదండ్రులు, బామ్మ చూపిస్తారు. ఇటువంటి కథను మహిళా దర్శకురాలు తీయగా, మహిళా నిర్మాత నిర్మించడం కూడా ఇప్పటి మహిళల ఆలోచనలు, అలవాట్లకు ప్రతిబింబంగా అనిపించకమానదు. వన్ మేన్ షోగా సిద్దు జొన్నలగడ్డ సినిమాను నడిపించాడు. 
 
లోగడ అనుష్క కూడా సరోగసి విధానంతో సినిమా చేసింది. ప్రేమించిన నవీన్ పోలిశెట్టిని వదులుకుంటుంది కూడా. అందుకు కారణం మగవారి ప్రేమపై పూర్తి నమ్మకం లేకపోవడం. ఇక తెలుసు కదా సినిమాలో అమ్మాయిల ప్రేమలో నిజాయితీ లేదనేది పాయింట్. కానీ  సిద్దు తను ప్రేమించి, పెండ్లిచేసుకుంటాననుకున్న ప్రేయసి చేసిన తప్పిదమే కథలోని అసలు పాయింట్.  దానితో ఆమెపై రివెంజ్ తీర్చుకోవాలనుకున్న పాత్ర సిద్దుది. దానిని డీల్ చేసే విధానంలో దర్శకురాలు చాలి హుందాగా, ఎక్కడా వల్గారిటీ లేకుండా, ముక్కు సూటిగా వుండే పాత్రను డిజైన్ చేసింది.
 
మహిళగా తమ సమస్యలు బాగా తెలిసిన దర్శకురాలిగా ఇప్పటి యువతులు ఏవిధంగా వుంటారనేది... హీరోతో నాలుగు పెండ్లిచూపుల సందర్భంగా హైలైట్ చేసింది. సహజంగా ఇటువంటి కథను పురుషులు డీల్ చేయడం వేరు. కానీ మహిళా డీల్ చేయడం ఆమె అనుభవాలు కూడా వుండి వుండవచ్చనిపిస్తుంది. ప్రమోషన్ లో ఇదే ప్రశ్న ఆమెకు ముందు వస్తే.. ప్రతి మనిషిలో వుండే రెండో కోణం అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.
 
ఇద్దరి హీరోయిన్లతో హీరో నటించే సినిమాలు చాలానే వున్నాయి. సరోగసి అనే కాన్సెప్ట్ లింక్ చేసి తీయడం విశేషం. బాలీవుడ్ లో చుప్ కే.. చుప్కే.. అనే ఓ సినిమా పోలికలు వున్నా ప్రధాన అంశం ఇందులో వేరుగా వుంటుంది. ఏది ఏమైనా దర్శకురాలికి బాలీవుడ్ లో సినిమా రంగంలోపై బాగా అవగాహ వుంది. తను అక్కడే కొన్నాళ్ళు పనిచేసిందికూడా.
 
ఇక ఇందులో నటించిన నటీనటులు అందరా పాత్రలపరంగా సరిపోయారు. కాస్త ఆటవిడుపుగా వైవా హర్ష పాత్ర వుంటుంది. తెలిసీ తెలీసీ అమాయకత్వం హీరోహీరోయిన్ల పాత్రలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. 
 
సంభాషణలు కూడా సన్నివేశపరంగా వున్నాయి. కెమెరా పనితం రిస్ లుక్  కనిపిస్తుంది. థమన్ ఈ సినిమాకు సంగీత నేపథ్యం కూడా ఇచ్చాడు. అది ఓజీ.. సినిమాలో కొట్టిన బీట్ లను తలపిస్తుంది.
 
సిద్ధూ పాత్రలో ఓ క్లారిటీ వుంది. ఈస్ట్రోజెన్ కే అంత వుంటే... ఇక్కడ.. టెస్టోస్టెరాన్ నాకెంత వుండాలంటూ... పాత్రలో రివెంజ్ ను స్టయిలిష్ గా చూపించాడు. అదేవిధంగా దర్శకురాలులో కూడా అంతే క్లారిటీ వుంది.

కానీ, డాక్టర్ రాగ పాత్రలో ఆమె సరియైన క్లారిటీ ఇవ్వలేకపోయింది. తను సిద్దును ప్రేమిస్తున్నానని వెంటబడి.. బెడ్ షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధం అంటూ వెళుతుంది. ఆ తర్వాత ఏమిజరిగిందనేది క్లారిటీ లేకుండా తనను తాను శిక్షించుకుంటుంది. ఇలా మారడానికి పెంపకమా? పెరిగిన వాతావరణమా? అర్థంకాదు.
 
ఇటువంటి కథలు ఒకప్పుడు మల్టీప్లెక్స్ చిత్రాలు అనిపిలిచేవారు. ఇప్పడు ఓటీటీ అనుకోవచ్చు. థియేటర్ కు వస్తేనే ఓటీటీ లో విడుదల అనే రూల్ వుంది కనుక ఇది రిలీజ్ చేశారు. ఎంత యూత్ సినిమా అయినా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. స్లోగా నడిచే ఈ సినిమాను ఏమేరకు యువత ఆదరిస్తారో చూడాలి
రేటింగ్ : 2/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు