పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణం పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపారు. ఇందులోభాగంగా, ఈ నెలాఖరులోగా ఈ పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇందుకోసం ప్రభుత్వం రూ.3 వేల కోట్ల మేరకు నిధులను మంజూరు చేయనుంది. అలాగే, ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులకు కూడా ఏపీ ఆర్థిక శాఖ క్లియర్ చేయనుందని సమాచారం. ఇదిలావుంటే జగన్ సర్కార్ రైతులకు కూడా తాజాగా శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌లో పండించిన పప్పు, ధాన్యాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించడం విశేషం.