ఈ పదోన్నతులను అధికారుల స్థాయిలో తక్కువగా.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువగా కల్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మెకానిక్‌లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్ సూపర్‌వైజర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది.
కాగా, ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఒక్కరికీ ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేశారు.