తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు.. నాణ్యమైన విద్యను అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. అలాగే, విద్యా విధానంలో కూడా సమూల మార్పులు చేస్తూ వస్తోంది. సరికొత్త విద్యా ప్రణాళికతో ముందుకు పోతోంది.
రాష్ట్ర విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మరియు డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ స్కుల్ళల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కోడింగ్‌తో పాటుగా ఇతర ప్రయోగాలను చేసేందుకుగానూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది.