ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుతపులి కలకలం

మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:00 IST)
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో మరోమారు చిరుతపులి కలకలం సృష్టించింది. గతంలో ఒకసారి యూనివర్శిటీ ప్రాంగణంలోకి వచ్చిన ఈ చిరుత పులులు... పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం రాత్రి మళ్లీ మరోమారు ఈ చిరుతపులులు విద్యార్థినిలు హాస్టల్ సమీపంలో సంచరించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాము వసతి గృహాల్లో ఉండలేమంటూ విద్యార్థులంతా కలిసి వీసీ భవనం వద్ద ఆందోళనకుదిగారు. 
 
హాస్టల్‌లో తమతమ గదుల నుంచి లగేజీలను కూడా వారు తీసుకుని బయటకు వచ్చేశారు. అందువల్ల అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ప్రాంగణంలో చిరుతల సంచారం ఉందని అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్శిటీ అధికారులతో పాటు పోలీసులు సూచించారు. రాత్రి 7 గంటల తర్వాత వసతి గృహాల నుంచి బయట తిరగొద్దని వారు కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు