ఈసారి వివిధ శాఖల నుంచి వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలు ఏకంగా రూ.2 లక్షల కోట్లను దాటాయి. ఆ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగే అవకాశం లేకపోవడంతో బడ్జెట్ కేటాయింపులకు పగ్గాలు వేయాలని ఆర్థిక శాఖ ముందు నుంచి పట్టుదలతో ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలకు భారీగా కోత వేసి రూ.1.54 లక్షల కోట్లకే కట్టడి చేసింది. బడ్జెట్ నిధుల కేటాయింపులో ప్రధానంగా విద్య, సంక్షేమం, జలవనరుల శాఖలదే పెద్ద పద్దుగా ఉండే సూచనలున్నాయి.