ఏపీ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్ బేఖాతరు చేసింది. ఈ అంశంపై ఇప్పటికి మూడుసార్లు మెయిల్స్ పంపినా ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, ఖాతాదారుల సమాచారాన్ని అందించలేమని నిరాకరించింది. అంతేకాదు తమకు ఖాతాదారుల వ్యక్తిగత భద్రత ముఖ్యని వాదిస్తోంది. దీంతో ఆ సంస్థపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
మూడు వారాల క్రితం ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు డీజీపీ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో నకిలీ ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. గౌతం సవాంగ్ ఫొటో కూడా ఆ ఖాతాకు జోడించారు. పోలీసులు దీన్ని ట్విటర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఖాతాను మాత్రమే తొలగించారు. అంతేకానీ అడిగిన సమాచారం ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఈ వ్యవహారంపై విజయవాడ సైబర్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
వీటి కోసం పోలీసులు ట్విటర్‌ను మెయిల్ ద్వారా సంప్రదించారు. దర్యాప్తులో లాగ్స్ కీలకమని, ఇవ్వకపోతే చట్టపరంగా ముందుకెళతామని మూడోసారి హెచ్చరించినా సమాధానం రాలేదు. దీంతో నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.