ఏపీ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం వేట కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు. బంగారం కోసం వెతుకుతున్న స్థానికులకు ఇప్పటికే రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలు, బంగారు రేణువులతో పాటు వెండి వస్తువులు కూడా దొరికాయని చెప్తున్నారు.