Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

చిత్రాసేన్

సోమవారం, 13 అక్టోబరు 2025 (15:49 IST)
Telusu kada Trailer about youth
యూత్ ఫుల్ సినిమాల పేరుతో యూత్ ను థియేటర్లకు రాబట్టడానికే సినిమాలు చేస్తున్న తరుణంలో ఈరోజు విడుదలైన తెలుసుకదా ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా  పాత్రలు యువతరానికి కనెక్ట్ అయ్యేలా వారి ప్రేమకథ సాగనుంది. కథలో ఊహించని మలుపులు, భావోద్వేగాలు ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి. ట్రైలర్ చూస్తే ఇద్దరమ్మాయిలతో హీరో బెడ్ షేర్ చేసుకోవడం అనేది చూపించారు.
 
అదేవిధంగా రాశీఖన్నాను బట్టలు తీసేయ్ అంటూ హీరో డైలాగ్.. బెడ్ పై ముద్దుపెట్టుకుంటూ వుండడం వంటివి చూపించడమే కాకుండా.. హీరో స్నేహితుడుగా చేసిన హర్ష.. కామన్ మేన్ గా ఆలోచించి ఇలాంటి మైండ్ సెట్ ఏమిటంటూ తిడతాడు. పైగా ఇలా ఎంతమందిని ఎక్కుతావ్.. నామీద కూడా ఎక్కు.. అంటూ వంగుతాడు.. ఇలాంటి సినిమా కు సెన్సార్ యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

హీరో, హర్ష పై సాగిన సీన్ గురించిఅడిగిన ప్రశ్నకు సిద్దు జొన్నలగడ్డ.. దాటవేశారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా నటించారు. వీరిద్దరూ లెస్ బియన్స్ గా వున్నారనేలా భ్రమ కలిగించారు.
 
దీనిపై దర్శకురాలు కోన నీరజ మాట్లాడుతూ, మనిషిలో ఇన్నర్ ఫీలింగ్ అనేది వుంటుంది. ఆ భాగమే ఈ సినిమా అంటూ చెబుతోంది. మహిళ అయి వుండి ఇలాంటి కథలతో సినిమాలు ఎందుకు తీశారంటే.. ట్రైలర్ లో చూసినా, సినిమాలో మంచి కంటెంట్ వుందంటూ చెబుతోంది.
 
ఇక హీరో సిద్ధు మాట్లాడుతూ, ఇప్పుడు మీరంతా చూసింది ఓ భాగం సినిమాలో అంతకుమించి వుంటుంది. దానిపై ఎవరి అభిప్రాయం వారిది. చివరిలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. ఇందులో హీరోలో నెగెటివ్ లక్షణాలు వుంటాయి. అవి ప్రేక్షకుడు ఇన్ వాల్ అయితే ఎవరికి వారే అసహ్యించుకుంటారు అంటూ క్లారిటీ ఇస్తున్నాడు.
 
అక్టోబర్ 17న విడుదలకానున్న ఈ సినిమాను నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇందులో ట్రైలర్ చూడ్డానికి ఇలా వున్నా మంచి కథ ఇందులో వుంటుందని అంటున్నారు. మరి రిలీజ్ తర్వాత జాక్ సినిమాతో ప్లాప్ తీసుకున్న సిద్ధు జొన్నలగడ్డకు ఈ సినిమా కూడా తెలుసుకదా అనిపిస్తుందా? లేదా? చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు