ఏపీ: నేడే 10th ఫలితాలు.. అందరు పాస్ అవుతారు కానీ..?

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:09 IST)
ఏపీలో 10th ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు పరీక్షల నిర్వహణ నిలిపివేశాయి. ఇక ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని పాస్ చేస్తున్నాయి ఆయా బోర్డులు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఫలితాలు వెల్లడించాయి. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది ఫలితాలు వెల్లడించనుంది.
 
సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. అయితే విద్యార్థులు అందరు పాస్ అవుతారు కానీ ఇందులో మార్కులే వారి భవిష్యత్తుకు చాలా కీలకం అవుతాయి. దీంతో తమకు మార్కులు ఎన్ని కేటాయిస్తున్నారు? ఎలా కేటాయిస్తున్నారు అన్న దానిపై ఇటు విద్యార్థుల్లో, అటు తల్లిదండ్రులల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
 
2020 మార్చి నుంచి 2021 జూన్‌కు సంబంధించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఫలితాలను www.bse.ap.gov.inతో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల మెమొరాండమ్‌ ఆఫ్‌ సబ్జెక్టు వైజ్‌ పెర్‌ఫార్మెన్స్‌‌లను తమ పాఠశాల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డైరెక్టర్‌ సుబ్బారెడ్డి సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు