Koo (కూ) యాప్‌‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

బుధవారం, 4 ఆగస్టు 2021 (15:28 IST)
ప్రజలను నేరుగా వారి మాతృభాషల్లో చేరుకోవాలనే ఉద్దేశ్యంతో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ Koo (కూ)లో చేరారు. ఇది యూజర్లకు (Users) వారి మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యమంత్రి చేరడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (@YSRCPOfficial), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ (@AndhraPradeshCM) మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (@APDigitalCorp) వారి అధికారిక అకౌంట్లను భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌‌లో సృష్టించారు.
 
@Ysjagan హ్యాండిల్‌‌ని ఉపయోగించి, శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలతో తెలుగు మరియు ఆంగ్లంలో సంభాషిస్తారు. వారి Koo (కూ) ప్రొఫైల్ నుండి ఇటీవల పోస్ట్‌ లో ఒక వీడియో షేర్ చేయబడింది. అందులో వారు తరతరాలుగా ఉండే స్థిరమైన ఆసుపత్రులను నిర్మించాల్సిన అవసరాన్ని తెలియజేసారు. యూజర్లు (Users) వారితో kooapp.com/profile/ysjagan లో కనెక్ట్ అవ్వచ్చు.
 
ముఖ్యమంత్రి గారు వారి యొక్క అకౌంట్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు మరియు ఆంగ్లంలో ప్రభుత్వంతో సంభాషించాలని మరియు ఇంటరాక్ట్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వ శాఖల Koo (కూ) అకౌంట్లు రాష్ట్రంలో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వేదికగా ఉపయోగపడతాయి.
 
Koo (కూ) వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ, “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని Koo (కూ) యాప్ కి స్వాగతిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు వారి ఫాలోవర్స్ అందరికీ అందుబాటులో ఉండేందుకు వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలను రోజూ సులభంగా వాళ్ళతో పంచుకునేందుకు Koo (కూ) యాప్ సహాయపడుతుంది” అని తెలిపారు.
 
Koo (కూ) సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్క గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ, "శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని Koo (కూ) లోకి స్వాగతిస్తున్నాము. Koo (కూ) యాప్ లో వారి ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే వారందరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాను" అని తెలిపారు.
 
Koo (కూ) ప్రఖ్యాతి చెందినందున రాష్ట్రం నుండి ఇంకా చాలామంది ప్రముఖులు, తత్వవేత్తలు మరియు ప్రాంతీయ పార్టీలు యాప్ లో చేరాలని భావిస్తున్నారు. ప్రజలు తెలుగుతో పాటు Koo (కూ) అందించే ఇతర భాషలలోని వ్యక్తులతో సంభాషించవచ్చు. ఇటీవల శ్రీ తనికెళ్ల భరణి గారు, శ్రీమతి విజయశాంతి గారు, శ్రీ ఎల్‌బి శ్రీ రామ్ గారు, నటీమణులు ఈషా రెబ్బా గారు మరియు అనుష్క శెట్టి గారు మరియు నటుడు నాగ శౌర్య గారు కూడా Koo (కూ) లో చేరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు