ఏపీకి మళ్ళీ భారీ వర్ష సూచన..

సోమవారం, 16 నవంబరు 2020 (13:47 IST)
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది.  కొమరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించింది. 

ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రోజున దక్షిణ కోస్తాతీరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
 
గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు