రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం - ఏపీలో సమ్మెలోకి దిగిన అంగన్‌వాడీలు

మంగళవారం, 12 డిశెంబరు 2023 (12:15 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్ వాడీలు సమ్మెకు దిగారు. ఏపీ సర్కారుతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు ఈ చర్యకు పూనుకున్నారు. దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్ల ఆందోళనతో ఉద్రిక్తతనెలకొంది. వేతనాల పెంపు, గ్రాట్యుటి కోసం డిమాండ్ చేశారు. 
 
మంగళవారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈ మేరకు అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించిన మూడు సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. 
 
ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యుటి కోసం డిమాండ్ చేస్తున్నట్టు వర్కర్లు, అంగన్‌ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని వారు ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళనకు టీడీపీతో పాటు జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు