Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

దేవీ

గురువారం, 14 ఆగస్టు 2025 (12:39 IST)
Cooli poster
నటీనటులు : రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, పూజా హెగ్డే, అమీర్ ఖాన్  తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్, సంగీతం : అనిరుధ్ రవిచందర్, నిర్మాత : కళానిధి మారన్, దర్శకుడు : లోకేష్ కనగరాజ్
 
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలయిన సందర్భంగా వచ్చిన చిత్రం కూలి. ఈ 50 ఏళ్ళలోనూ ఆయన హీరోగా నటించడం విశేషం. హీరోగా ఎంట్రీ ఇచ్చి అక్కినేని నాగార్జున విలన్ గా చేయడం ఓ భాగమైతే, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ విలన్ కు బాస్ గా చేయడం విశేషం. పూజా హెగ్డే, శ్రుతిహాసన్, ఉపేంద్ర వీళ్ళంతా వున్నారంటే ఏదో విశేషమం వుంటుందని ముందుగానే పబ్లిసిటీ ఇచ్చేశారు. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందా.
 
కథ :
సైమన్ (నాగార్జున) షిప్ యార్డ్ లో వందలాది కార్మికుల చేత పనులుచేయించుకుంటాడు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో అనుమానం వచ్చిన వారిని తన అనుచరులతో చంపేస్తుంటాడు. మరోవైపు దేవా (రజనీకాంత్) తన టీమ్ తో సిటీలోనే పవర్ హౌస్ అనే అపార్ట్ మెంట్ లో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. దేవా ప్రాణ స్నేహితుడు (రాజశేఖర్) సత్యరాజ్ చనిపోయాడని తెలిసి వెళితే అక్కడ కుమార్తె శ్రుతి హాసన్ అవమానిస్తుంది. 
 
రాజశేఖర్ ది సహజ మరణం కాదని, హత్య అని దేవా ఆమెకు చెబుతాడు. అయినా వినని శ్రుతి, దేవాను మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. ఆ తర్వాత శ్రుతి ఫ్యామిలీని సైమన్ మనుషులు ఎటాక్ చేస్తారు. వారిని దేవా కాపాడతాడు. అసలు ఎందు దేవా ఆ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. ఆ క్రమంలో తన తండ్రి సెల్ క్రిమిలేషన్ అనే కొత్త పరికరాన్ని కనిపెట్టాడని చెబుతుంది. అది ఏమిటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేవి మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ చిత్రంలోని ప్రధాన మైన పాయింట్ సరికొత్తగా వుంది. చనిపోయిన వారిని ఎలట్రికల్ క్రిమిలేషన్ లో కాల్చివేస్తే కొంత టైం పడుతుంది. కానీ శ్రుతి తండ్రి కనిపెట్టిన సెల్ క్రిమిలేషన్ అనేది నిముషాల్లో ఎంతమందినైనా బూడిద చేసేస్తుంది. దానిని సైమన్ ఎందుకు ఎన్నుకున్నాడు. అనేది కూలీ లో ఆసక్తికరమైన పాయింట్. సహజంగా మాఫియా సినిమాలకు పెట్టింది పేరైన రజనీకాంత్ చిత్రాలు బాషా తర్వాత రకరకాల నేపథ్యంలో వచ్చినవే. ఇప్పుడు కూలీ కూడా అటువంటిదే. గతంలో మారిషస్ లో వలసకూలీల నేపథ్యంలో ఆయన చేసిన అందరికీ తెలిసిందే. ఇందుకు దానికి సీక్వెల్ గా వుండేలా వుంది. 
 
ప్రపంచంలో ఇలాంటి క్రిమిలేషన్ అనేవి మనకు తెలీని కొత్త కాన్సెప్ట్. ఆమధ్య బెంగుళూరులో ఓ చోట కొన్ని శవాలు బయటపడ్డాయి. ఒకటి రెండు మినహా చాలాశవాలు వున్నాయని కాటికాపరి చెప్పాడు. మిగిలిన శవాలు ఏమయ్యాయో వెతికినా దొరకలేదు. బహుశా ఇలాంటి ప్రక్రియతో ఏదైనా చేసివుంటారనేది ఈ సినిమా చూశాక అవగమమవుతోంది. మాఫియాలో చాలామంది అనుచరులు చనిపోతుంటారు. వారిని పోలీసులు గుర్తించకుండా వుండాలనే ఇలాంటి కొత్త విధానం వారికి అవసరం అనేలా ఈ చిత్రం చెబుతుంద.ి
 
దేవాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను ఉత్సాహపరిచడానే చెప్పాలి. అతని స్టయిల్ ఏ మాత్రం బోర్ కొట్టకుండా చూసేలా వుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఉపేంద్ర అండగా నిలవడం సెకండాఫ్ లో బాగుంది. క్లయిమాక్స్ లో అమీర్ ఖాన్ ఎంట్రీ తో బాషాను తలపిస్తుంది. ఇలా రజనీకాంత్ కు అనుకూలంగా కథను, సన్నివేశాలను దర్శకుడు రాసుకుని ఆయన ఇమేజ్ ను చూపించాడు. ఇక సైమన్ పాత్రలో నాగార్జున సరికొత్తగా కనిపిస్తాడు. కుబేర సినిమాలో స్టయిలిష్  విలనిజం వున్న ఛాయలున్నా మానవత్వం గల పాత్రగా చూపించారు. కానీ ఇందులో పూర్తి విరుద్దంగా వుంటుంది. ఇక ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. ప్రతి సినిమాలోనూ పరబాషా హీరోలను పెట్టుకునేట్లుగా ఈసారి కూడా అలానే చేశాడు రజనీకాంత్.
 
పూజా హెగ్డే ఐటంసాంగ్ కే పరిమితం. సౌబిన్ షాహిర్ కూడా చాలా బాగా నటించాడు. కానీ శ్రుతి పాత్ర ఆద్యంతం రజనీకాంత్ తో కొనసాగుతుంది. ఆ క్రమంలో ఇతర పాత్రలు వుంటాయి. ఏది ఏమైనా రజనీకాంత్ కు, శ్రుతికి మధ్య రిలేషన్ ఏమిటనేది సినిమా చూసేవారికి అర్థమయినా అంకుల్ అంటూ పిలిచేలా  ఎందుకు చేశారనేది అర్థంకాకపోయినా ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందా? అనేది ప్రేక్షకులకు వదిలేశాడు.
 
దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్న యాక్షన్ సీన్స్ చిత్రానికి బలం. వాటినే మాస్ ప్రేక్షకులు చూస్తారని వారి పల్స్ తెలిసినట్లు అన్నిసినిమాల్లోనూ యాక్షన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు.
 
ఇక దేవా పాత్ర తీరును రొటీన్ గానే రాసుకున్నాడనిపించింది. ఆ పాత్ర ట్రీట్మెంట్ ను సరిగ్గా రాసుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు. కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన లోకేష్ సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ నేపధ్య సంగీతం బాగుంది. గిరీష్ గంగాధరణ్ ప్ర‌తి స‌న్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువ‌లైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని కళానిధి మారన్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.
 
రొటీన్ కథగా సూపర్ స్టార్ ను పెట్టి ఇతర భాషల్లో సూపర్ స్టార్స్ కూడా ఇన్ వాల్వ్ చేసి కథను మెప్పించి నటించేలా చేయడం కూలీ ప్రత్యేకత. వారంతా లేకపోతే రొటీన్ మాస్ మసలాగా వుండేది. అయినా ఆల్ రెడీ ఈ నేపథ్య కథలు చాలానే వచ్చాయి. క్రిమిలేషన్ అనే కొత్త విధానం చెప్పడానికి ఈ సినిమా తీసినట్లుంది.
రేటింగ్ : 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు